నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2 :
భూ కబ్జా దారులు ఏక్కడ చూసిన ప్రభుత్వ భూములను వదలడం లేదు దీనికి తోడు అధికారులు కుమ్మక్కై పట్టాలు చేయడం రిజిస్ట్రేషన్ పత్రాలను జారీ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇందుకు భూ కబ్జాకోరులు కబ్జాలకు గురి చేస్తున్నారు . ఇటీవల ముప్కాల్ మండల కేంద్రంలో లక్ష్మీ కాలువ భూమి కబ్జాకు గురైన విషయంపై బాల్కొండ ఇరిగేషన్ డిప్యూటీ అధికారికి వినతిపత్రం అందజేశారు .వినతి పత్రం ద్వారా సమస్యను తెలియపరిచిన ముప్కాల్ గ్రామపరిరక్షణ సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో గ్రామపరిరక్షణ సమితి కార్యదర్శి సంజీవ్ థామస్, సభ్యులు టి.సాయన్న, కట్ట మహేష్, గద్దల గంగారాం, జక్కుల రాము, నేర బాబూరావు, కందుల శంకర్, కంచు గంగాధర్, బోట్ల భూమన్న, అనికేశి నడ్పి రాజన్న, రాకేష్, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు..