కాకతీయ స్కూల్ మరియు కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1.నిజామాబాద్ నగరం లో 9వ తరగతి చదువుతున్నటువంటి శివ జశ్విత్ అనే విద్యార్థి దగ్గు జ్వరంతో బాధపడుతున్నా కానీ యాజమాన్యం కి ఇసువంతా కూడా కనికరం లేకుండా అబ్బాయిని హాస్పిటల్కు చూపించకుండా భయభ్రాంతులకు గురిచేసి కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అతని మరణానికి కారణమైనటువంటి కాకతీయ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.గత నాలుగు రోజుల నుంచి శివ జశ్విత్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ పట్టించుకోని యజమాన్యం పై చర్య తీసుకోవాలి. శివ జస్విత్ తల్లి తండ్రుల కు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన కాకతీయ స్కూల్స్ కాలేజీ లైసెన్స్ రద్దు చేయాలని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పోరేట్ వ్యవస్థ విద్య స్థాయి లో నడుపుతున్నటువంటి స్కూల్స్ మరియు కాలేజీలు పైన కూడా ప్రభుత్వం స్పందించి అక్కడ జరుగుతున్నటువంటి లోటు పాటుల ను గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగితే ఊరుకునేది లేదని అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.అదేవిధంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో కొంతమంది విద్యార్థులు చనిపోయారు. కొంతమంది విద్యార్థులు ‌ తీవ్ర అస్వస్థత తొ బాధపడుతున్నారని దీనికి కారణమైనటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అబ్బ గోని అశోక్ గౌడ్ తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!