నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26.
75వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. సింధు శర్మ, ఐ.పి.యస్. ఆదేశానుసారంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) శ్రీ కోటేశ్వర రావు , అదనపు డి.సి.పి ( లా అండ్ ఆర్డర్ ) శ్రీ బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శ్రీ శంకర్ నాయక్ భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.తొలి దశలో డా|| బి.ఆర్. అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా అదనపు డిప్యూటి కమీషనర్ లు మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశిక గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ కార్యాక్రమంలో ఎ.ఆర్. ఎ.సి.పి నాగయ్య, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్, వనజరాణి, రిజర్వు ఇన్స్పెక్టర్స్ సతీష్ కుమార్, తిరుపతి, శ్రీనివాస్, శ్రీపాల్, శేఖర్, ఎ.ఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.