తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20.
వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.కామారెడ్డి జిల్లా, బాన్సువాడ. పట్టణం లో వరుస వీధికుక్కల దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాలు జారీచేశారు.నిన్న ఒక 4 సంవత్సరాల బాలికపై కుక్కల దాడి ఘటన మరవకముందే ఈ రోజు ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడిచేసి గాయ పర్చాయి. ఈ ఘటనపై కుటుంబీకులతో సహా స్థానిక మాజీ వార్డ్ మెంబర్ షేక్ అక్బర్, లాయాక్ ఆధ్వర్యంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కు ఒక మెమొరండం సమర్పించారు. వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ పిల్లలను ఒంటరిగా వదలకూడదని తమ పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
,