నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 18.
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో V.H.P.S నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు మరో ఉద్యమానికి నాంది పలికిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా మొదలైన రీల నిరాహార దీక్షలు.. నిజామాబాద్ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బీరప్ప, ప్రారంభం చేయగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎమ్మార్పీఎస్ MRPS జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ , M.S.Pమహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు సరికల పోశెట్టి , జిల్లా ప్రధాన కార్యదర్శి మంద ప్రభాకర్ , మరియు ఎమ్మార్పీఎస్ MRPS వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని నిరాహార దీక్షలు మొదలుపెట్టారు.