నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13.
చిట్టాపూర్ గ్రామానికి చెందిన చెంచుల నక్క సంజీవ్ నీ గ్రామ అభివృద్ధి కమిటీ కి చెందిన కొందరు నియంతలు సంజీవ్ ఇంటి బాత్రూం ని అది చెరువు లో ఉందని దౌర్జనంగా జెసిబి తీసుకువచ్చి కూలగొట్టారు. మరియు సంజీవ్ కు 50 వేల జరిమానా విధించారు జరిమానా కట్టకపోతే నిన్ను గ్రామంలో తిరగనీయమని బెదిరింపులకు పాల్పడ్డారు. సంజీవ్ ఏం చేయలేక 50,000 జరిమానాన్ని కట్టాడుఅయినా కూడా అతని బాత్రూం ని కూలగొట్టడం జరిగింది. చిట్టాపూర్ గ్రామ కమిటీలో కొందరు నియంతలు వారి పేర్లు గుజూరు పుల్ల రాజారాం. ఆర్మూరు రాజు. ఆరె భూమన్న. కత్తి రాజ్ రామ్ రాజ్. బోదాసు సత్యం. అల్లకుండా రాజలింగం. వీళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఇత్వార్ పేట్ లింగన్న డిమాండ్ చేశాడు.