నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12.
ఇటీవల వికారాబాద్ జిల్లా లో కలెక్టర్, ప్రతిక్ జైన్ పై అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మరియు రెవిన్యూ సిబ్బందిపై సోమవారం వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ కొరకు ప్రజాభిప్రాయం సేకరణకు వెళ్తుండగా దాడి చేసిన విషయం తెలిసిందే, దానికి నిరసనగా మంగళవారం రోజు భోజన విరామ సమయంలో బాల్కొండ తహసిల్దార్ తో పాటు కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.