తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12 .
భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను నవంబరు 11 న బాల్కొండ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో సోమవారం ప్రిన్సిపాల్ చందన ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ చందన మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించి, జాతీయ విద్యా విధానం అమలు చేశారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అబుల్ కలాం ఆజాద్ అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ప్రిన్సిపాల్ చందన, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మజారుద్దీన్, మర్కస్ కమిటీ జాయింట్ సెక్రెటరీ సయ్యద్ శంషాద్దీన్, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు.