ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి: అదనపు పోలీస్ కమీషనర్

  1. నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6 . నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీ సింధూశర్మ, ఐ.పి.యస్., గారి ఆదేషనుసారంగా నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెడికవర్ హస్పటల్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యాక్రమం నిర్వహించగా ముఖ్యఅతిధులుగా అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) శ్రీ కోటేశ్వర రావు, అదనపు డి.సి.పి ( లా అండ్ ఆర్డర్ ) శ్రీ బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శ్రీ శంకర్ నాయక్ హజరుకావడం జరిగింది.ఈ సందర్భముగా అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్) మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడు విధుల నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యం పై అవగాహన ఎంతో ముఖ్యమని సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో వ్యాధులు ఏంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల భారీన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని మనం తీసుకునే అన్నిరకాల ఆహర పదార్ధలలో చాల కల్తీ గలదని, కొన్ని వ్యాదులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాదునిక వైద్య సదుపాయాలు అందుబాటులో గలవని, ప్రత్యేకంగా ఇ.సి.జి, 2 డిఈకో, బిపి, కంటి కరీక్ష, రాండమ్ బ్లడ్ షుగర్, సి.బి.పి ( కంప్లీట్ బ్లడ్ పిక్చర్) దంత పరీక్షలు మొదలగు వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వి నియోగం చేసుకోవాలని, ప్రతీ సంవత్సరం ఒక్కసారైన మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించవలెను. మందులు వాడేదానికంటే ముందుజాగ్రతలు తీసుకోవడం మంచిదని అన్నారు.ఇలాంటి క్యాంప్ ల ఏర్పాటు చేయడం ఎంతో అభినందని యమని, ఈ క్యాంప్ నేడు ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారని దీనిని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది పోలీస్ కార్యలయం సిబ్బంది పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది హోమ్ గార్డ్సు మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.దాదాపు 370 మంది సిబ్బంది పరీక్షలు సద్వినియోగ పర్చుకున్నారు ఈ కార్యాక్రమంలో నిజామాబాద్, బోధన్, స్పెషల్ బ్రాంచ్ ఎ.సి.పిలు, శ్రీ రాజా వెంకట్ రెడ్డి, శ్రీ పి. శ్రీనివాసులు, శ్రీ ఎస్. శ్రీనివాస్ రావ్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీ తిరుపతి (ఎమ్.టి.ఓ), శ్రీ శ్రీనివాస్ ( వెల్ఫేర్ ) పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డా॥ సరళ, దేవాగౌడ్ పోలీస్ స్టాఫ్ మరియు డాక్టర్లు శ్రీ సందీప్ రావ్ (కార్డియాలజిస్ట్)), శ్రీ ప్రశాంత్ (పర్మనాలజిస్టు, శ్రీ దత్తు రాజు ( జనరల్ మెడిసిన్ ), శ్రీ కౌశిక్ ( జనరల్ సర్జన్), శ్రీ రామకోటేశ్వర రావ్ (ఆర్థోపెడిక్) సుష్మ నాగసూరి ( గైన కలజిస్టు), శ్రీ అజయ్ కుమార్ ( కిడ్ని ) శ్రీ సాంబశివరావ్ ( డెంటల్) శ్రీ వెంకట్ (పిడియాట్రిక్ ), శ్రీ వెంకటేశ్ ( కంటి వైద్యులు) సిబ్బంది, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షకీల్ పాషా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!