మంగళవారం నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన కోసం నిజాంబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మరియు సభ్యుల ముందు
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బ గోని అశోక్ గౌడ్
తెలంగాణలో బీసీ కుల గణన వెంటనే చేపట్టి కులాదారిత
బీసీలలో ఉన్నటువంటి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ పరంగా చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, చట్ట సభల్లో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, పారిశ్రామిక రంగంలో సబ్సిడీలు భూముల కేటాయింపులు, విద్యా ఉద్యోగ ఉపాధి రంగంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం సకలజనుల సర్వే జరిపించి బీసీల ఆధారిత జనాభా ప్రకారం జరిపించినా కానీ బీసీల లెక్కను బయటపెట్టగా జంతువులను లెక్కపెట్టించి బీసీల తోని ఆట ఆడుకోవడం అనేది సరైనది కాదని అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా పూర్తిస్థాయి బీసీ కులగలను జరిపించి గత ప్రభుత్వంలో కాకుండా అన్ని బీసీ సంఘాల ముందు సర్వే జరిపించి దానిని కచ్చితంగా బయటపెట్టాలని అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్, బడ్జెట్లో వాటా, వివిధ కులవృత్తుల వారికి/ సేవా కులాల వారికి ప్రత్యేక సబ్సిడీ పథకాలు మరియు బీసీ కులాల ఉత్పత్తిలకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రత్యేకమైన సెజ్ లు, బీసీ కులాల వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం వంటి అంశాలతో పాటు కులాల వారీగా సమస్యలు పరిష్కారాలు చేయాలని దాదాపు 20 డిమాండ్లతో బీసీ కమిషన్ ముందు వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు అన్న గౌడ్ నారా గౌడ్ ,ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు సూర్రి నీడ దశరథ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజాంబాద్ యువజన అధ్యక్షులు ఉప్పో నూతల రాజా గౌడ్ , నిజాంబాద్ జిల్లా యువజన అధ్యక్షులు కపిల్ పవర్ బిసి నాయకులు నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు