బాల కార్మికులుగా మారిన 9వ తరగతి విద్యార్థులు.

పెన్ను పేపర్ పట్టాల్సిన చేతులతో తట్టలు మోస్తున్న విద్యార్థులు

ఇసుకను మోసుకెళ్తున్న 9వ తరగతి విద్యార్థులు

మోపాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగులోకి

స్పోర్ట్స్ గ్రౌండ్ లో నీరు నిండడం వలన పిల్లలతో ఇసుక మోపిస్తున్నానని సమాధానం ఇచ్చిన హెచ్ఎం

సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలంటున్న గ్రామ ప్రజలు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 20 : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇసుక డంపింగ్ కలకలం లేపుతుంది అంతేకాకుండా విద్యార్థుల చేత ఇసుకను మోయించడం గమనార్షం ఇవన్నీ గ్రామ అభివృద్ధి కమిటీ మరియు పాఠశాల కమిటీ తెలియదా అనేది ప్రశ్నార్థకం, ఒకవైపు ఇసుక డంపింగ్లను జిల్లా పోలీస్ కమిషనర్ ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్న మోపాల్లో మాత్రం ప్రభుత్వ స్థలాలలో డంపింగ్లు ఏర్పాటు చేసుకొని వారి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు ఇందులో హెచ్ఎం గోవింద్ ను వివరణ కోరగా నాకేమీ తెలియదు అంటూ సమాధానం ఇవ్వడం నేటి బాలలు రేపటి పౌరులు అన్న మాటలు ఇప్పుడు కేవలం నీటిమట్టల్లాగానే ఉన్నాయని గ్రామస్తులు చెవులు కోరుకొంటున్నారు,ఈ డంపింగ్లు ఎవరియి ప్రధానోపాధ్యాయుడికి ఎందుకు అంత శ్రద్ధ అనేది ఇప్పుడు గ్రామస్తులల్లో కొత్తగా ప్రశ్నలను రేకిస్తున్నాయి ఆ స్కూల్లో ఉన్న ఇసుక డంపింగ్లను స్థానిక పోలీసులు కూడా పట్టించుకోకపోవడం దీనికి అర్థం చూడాలి డి ఈ ఓ జిల్లా అధికారి ఇకనైనా సంఘటన స్థలానికి చేరుకొని వీటి విషయంపై అరా వలసిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఇలాంటి ఇసుక మాఫియా దారులు ప్రభుత్వ స్థలాలను ఎంచుకొని ఎవరికి అనుమానం రాకుండా అందులో డంపు చేసే అవకాశాలు నూటికి నూరు శాతం ఉందని అర్థమవుతుంది ఎమ్మార్వో మరియు పోలీసులు ఈ అపనిందను మోయకుండా వెంటనే ఆ ఇసుక డంపు ను విచారించి సీజ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు గ్రామస్తులు, అంతేకాకుండా స్కూల్ కు వచ్చే విద్యార్థుల చేత ఇసుక ను మోహించడం ఎంతవరకు సమంజసం చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు ఇసుక మోగించడం ఇది ఎంతవరకు న్యాయం దీనిపట్ల ప్రధానోపాధ్యాయుడికి ఎలాంటి బాధ్యత లేదా అని కొందరు గ్రామస్తులు అంటున్నారు, ప్రభుత్వ పాఠశాలలపై ఇప్పుడిప్పుడే మంచి అభిప్రాయాలు ఏర్పా ఏర్పడుతుంటే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేందని ముక్కు మీద వేలుసుకుంటున్నారు ఇకనైనా ఆ ప్రధానోపాధ్యాయున్ని పై చట్టరీత్యామైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు లేదంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ ఇసుక ఎవరిది ఈ ప్రధానోపాధ్యాయుడు ఎందుకు నోరు ఇవ్వడం లేదు వారి దగ్గర నుండి ఏమైనా ఆమ్యామ్యాలు ముట్టాయా అని పలు అనుమానాలకు దారితీస్తుంది ఇకనైనా ప్రధానోపాధ్యాయుడు గోవింద్ నోరు విప్పితే అసలు నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని కోరుకుంటున్నారు స్థానికులు డీఈవో సారు ఈ స్కూలును పట్టించుకోండి అసలేం జరిగింది వీటిపై మీరే నిర్ధారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment