ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగలో పేకాటరాయుళ్లు తమ జోరును కొనసాగించారు. పేకాటను నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పేకాట జోరు తగ్గలేదు.దీపావళి పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దీపావళి వేళ పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 138 కేసులు నమోదు చేస్తున్నట్లు సీపీ సాయి చైతన్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ లో మొత్తం 138 కేసులు నమోదు చేసి రూ.14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ డివిజన్ లో మొత్తం 42కేసులు, 180మంది నిపట్టుకొని వారినుంచి రూ.5,13,402 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అలాగే ఆర్మూర్ డివిజన్ లో మొత్తం కేసులు 44, పేకాట ఆడుతూ పట్టుబడిన మొత్తం 232 మంది, మొత్తం రూ.5,51,785 నగదు స్వాధీనం, అదేవిధంగా బోధన్ డివిజన్ లో మొత్తం కేసులు 52, పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు 187 మంది, మొత్తం రూ 3,50,730 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.మూడు డివిజన్ ల మొత్తం కేసులు 138 నమోదు చేసి మొత్తం 599 మంది పై కేసులు నమోదైనట్లు, వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు.
జిల్లాలో జోరుగా పేకాట–పేకాటలో 138 కేసులలో 599 మంది అరెస్ట్.. 5.14,15,917 స్వాధీనం..
Published On: October 23, 2025 9:13 pm









