నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : ఆదివారం – హైదరాబాద్ లోని కంబాట్ తైక్వాండో అకాడమీ లో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుఱ్ఱం కృష్ణ, జెనరల్ సెక్రెటరీ మిర్ వాహజ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ లో క్యూరియస్ తైక్వాండో అకాడమీ కి చెందిన– నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు జాతీయ స్థాయికి ఎంపికైయ్యారని కోచ్ వినోద్ నాయక్ తెలిపారు. ఎం. మయాంక్ తేజ్ – సబ్ జూనియర్ | మేల్ | ఓవర్ 44 కేజీ కేటగిరీ. గోల్డ్ మెడల్ & నేషనల్స్‌కు ఎంపిక, కె. శీతల్– సబ్ జూనియర్ | ఫీమేల్ | పూమ్సే (బ్లాక్ బెల్ట్) గోల్డ్ మెడల్ & నేషనల్స్‌కు ఎంపిక.ఇద్దరు అథ్లెట్లు తెలంగాణ రాష్ట్రం తరఫున 2025 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 2 వరకు ఒడిశా, కటక్‌లో జరగనున్న 4వ సబ్ జూనియర్ & సీనియర్ నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్ లో ప్రతినిధులుగా నిలవ బోతున్నారు.మన క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గోని విజయాలతో తిరిగి రావాలని జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డా. రమేష్ పవార్, ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ మరియు అసోసియేషన్ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
4వ సబ్ జూనియర్ & సీనియర్ నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్ 2025 – సెలక్షన్ ట్రయల్స్
Published On: August 18, 2025 1:16 pm










