డిచ్పల్లి ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 14 (ఆర్మూర్ గంగాధర్)
ప్రపంచ మేధావి డాక్టర్ బీ ఆ ర్ అంబేద్కర్ 134 వ జయంతి విడిసి సభ్యులు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కలిసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా గ్రామ సెక్రెటరీ వినయ్ గ్రామసభ నిర్వహించి పలు సమస్యల పైన విచారించి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గ్రామ సెక్రెటరీ వినయ్ దృష్టికి తీసుకెళ్లారు వీడిసి రైటర్ ఆసది తోట కిషన్ వీడిసి మరియు వీడిసి సభ్యులు గ్రామ ప్రజలు గ్రామ శ్రీ సీతారాముల ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.
విశ్వరత్న , పరంప్యూజ్, భారతరత్న, బోధిసత్వ,రాజ్యాంగ శిల్పి, సాంఘిక సంస్కర్త , విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి,ప్రముఖ భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ మహానేత, అంటరానితనం మరియు కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహానేత. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎత్తి సామాజిక సమానత్వంకు నేతృత్వం వహించిన మహాఘనుడు, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, సామాజిక రాజకీయ హక్కుల కోసం అహర్నిశలు పాటుపడిన మహాయోధుడు, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, ప్రపంచ మహామేధావిగా, విజేయ విఖ్యాతుడుగా, తన దేశ ప్రజలకై అహోరాత్రులు శ్రమించి మన రాజ్యాంగాన్ని రూపొందించిన ధీరుడు, విజ్ఞాన యోధుడు _డా,, బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 134th జన్మోత్సవ_ శుభాకాంక్షలు..