నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 14.
ఈ రోజు నిజామాబాద్ RTC బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా మరియు సిబ్బంది నెంబర్ ప్లేట్ లేని 30 వాహనాలను మరియు 10 అనధికార సైలెన్సర్ వల్ల శబ్ద కాలుష్యం చేస్తున్న మోటర్ సైకిల్ లను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరలించనైనది, తదుపరి నెంబర్ ప్లేట్ మరియు సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ పైన జరిమానా విధించి కొత్త నెంబర్ ప్లేట్స్ మరియు కంపెనీ సైలెన్సర్ వేయించిన తరువాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన రైడర్స్ కి అవగాహన కల్పించి నెంబర్ ప్లేట్స్ లేకుండా మరియు శబ్ద కాలుష్యం చేస్తూ వాహనములు నడిపించవద్దని అవగాహన కల్పించినారు లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.