నిజామాబాద్ జై భారత్ జూన్ 17: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ చార్జి తీసుకున్న తర్వాత గ్రామ అభివృద్ధి కమిటీలపై కఠినంగా VDC మీద కఠినంగా వ్యవహరిస్తామని ముందే హెచ్చరించడం జరిగింది.అట్టి ప్రణాళికలలో భాగంగా VDC వారు చేసిన అన్యాయాల మీద పాత కేసులను ఐడెంటిఫై చేసిన తదుపరి జ్యూడిషియల్ విచారణ అనంతరం స్పెషల్ కోర్టుల ద్వారా ఫాస్ట్ ట్రాక్ కేసుల ద్వారా, త్వరితగతిన ట్రాయాలు నిర్వహించి, జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో జక్రన్ పల్లి మండలము మునిపల్లి గ్రామంలో ST- నాయక్ పోడు కులానికి చెందిన తుమ్మ రవీందర్ అతని కుల సభ్యులను 2021 సం.,లో రోడ్డు విషయంలో మునిపల్లి విడిసి సభ్యులు కుల బహిష్కరణ చేసినారని అప్పటి విడిసి సభ్యులు 16 మంది పై SC, St మరియు సంఘ బహిష్కరణ కింద కేసు నమోదు చేయడమైనది.13 మంది వీడీసీ సభ్యుల మీద 5 సంవత్సరాల జైలు శిక్ష సాధించడం జరిగింది. ఏ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ అభివృద్ధి కమిటీలు (VDC) కులము పేరుతో గాని లేదా మతము పేరుతో గాని చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకోవాలని ప్రయత్నించిన, ఎవరినైనా ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకొనడం జరుగుతుంది.ఇట్టి కేసులో నిందితులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారి నిజామాబాదు ACP L.రాజా వెంకట్ రెడ్డి, జక్రాన్ పల్లి SI MD. మాలిక్, కోర్టు కానిస్టేబుల్ అధికారి కిషోర్ PC 261 లను పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS.. అభినందించారు.