నిజామాబాద్ జై భారత్ జూలై 1: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనా దారులు మద్యం త్రాగి వాహనాలు నడుపడం వలన 17 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం నాడు పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని మంగళవారం నాడు జిల్లా మార్నింగ్ కోర్టులో హజరు పర్చగా వారికి శ్రీమతి. నూర్జహన్ బేగం స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు 11 మందికి జైలు శిక్ష మరియు 6 గురికి జరిమానా విధించడం జరిగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11 మందికి జైలు శిక్ష.
Updated On: July 1, 2025 6:43 pm
