నిజామాబాద్ జై భారత్ జూన్ 26: నిజామాబాద్ నగరంలో గురువారం చంద్రశేఖర్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ నూరుద్దీన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల కు ముగ్గు వేయడం జరిగింది. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తమ ఇల్లు మంజూరు కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి మరియు షబ్బీర్ అలీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు సుమన్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
నగరంలో ఇందిరమ్మ ఇండ్ల కు శ్రీకారం
Published On: June 26, 2025 12:16 pm
