ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సార్ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ ముందు హాజరుపరచగా 10 మందికి13,000/- జరిమానా విధించి, మిగితా 6 గురు వ్యక్తులకు జైలు శిక్ష విధించడం అయినది.ఇట్టి సందర్భముగా ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వాహనదారులు ఎట్టి పరిస్థిలో మద్యం సేవించి వాహనాలు నడపరాదనీ లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించినారు.
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్షా మరియు 10 మందికి జరిమానా
Published On: October 28, 2025 4:01 pm









