కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
ఆర్మూర్ మున్సిపల్ పై జెండా ఎగరేస్తాం ఎమ్మెల్యే
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27: (నవీన్ కుమార్) ఆర్మూర్ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు యువకులు భారీగా బీజేపీ లో చేరారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల 8వ వార్డు నుండి బిఆర్ఎస్ యువజన నాయకుడు అరుణ్ తన 150 మంది అనుచరులతో బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కి స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ 150 మందితో కలిసి బీజేపీ లో చేరారు. వీరికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు నచ్చి మోదీ అభివృద్ధి చూసి పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ సమక్షంలో జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని స్థానిక ఎన్నికలలో గెలుపు పక్క అని బీజేపీ ఆర్మూర్ లో జెండా ఎగురవేస్తామని అత్యధిక కాన్సిలర్ స్థానాలు గెలవడం పక్కా అని బీజేపీ లో అభివృద్ధి మాత్రమే ఉందని అతి త్వరలో ఇతర పార్టీల నుండి బీజేపీ లో చేరికలు ఉంటాయని నియోజకవర్గం లో ఉన్న బీజేపీ కార్యకర్తల అందరితో కలిసి భారి సభ ఏర్పాటు చేసుకుంటామని రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, పోల్కం వేణు, జెస్సు అనిల్, పెద్దోళ్ల గంగారెడ్డి, కలిగోట్ గంగాధర్, మధు, పోచంపాడ్ శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.









