ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తా

వైద్య సేవలు
Headlines:
  1. పెంబి మండలంలో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన గోడం నగేష్
  2. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్న ప్రభుత్వ చర్యలు
  3. పెంబి మండల ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా, విద్య, వైద్యం – ఎంపీ గోడం నగేష్

మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ అన్నారు. మంగళవారం పెంబి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ విశాఖ ద్వారా 1 కోటి 56 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పార్లమెంట్ సభ్యులు పాల్గొన్ని మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని పెంబి మండలంలోని మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన పెంబి మండలంలో విద్యా, వైద్యం, రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

వైద్య సేవలు

జూనియర్ కళాశాల మంజూరుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖానాపూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ, నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ నిరంతరం వైద్య సేవలు అందించాలని సూచించారు. మారుమూల గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో అధునాతన వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుందని అన్నారు.  అలాగే సబ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు రహదారి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకుముందు ముఖ్య అతిథులను గ్రామస్తులు పూలమొక్కలను అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజూర సత్యం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, డీఈఓ రవీందర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ నర్సయ్య, ఎంపీడీవో రమాకాంత్, అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!