కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం.

కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. పోలీస్ అమరవీరుల దినోత్సవం లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: పాత నేరస్థుడు రియాజ్ మృతి చెందిన ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల నిజామాబాద్ నగరంలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ హత్య తనను తీవ్రంగా కలిసి వేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ తన ప్రగాఢ సానుభూతిని అందించారు.కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పోలీస్ భవిష్య నిధి నుండి 18 లక్షలు, పోలీస్ సంక్షేమ నిధి నుండి ఎనిమిది లక్షలు ఇస్తామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘతం కలిగించే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment