తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 23.
MRPS, నాయకపోడు సంఘం, మహజన మహిళ సంఘం జిల్లా కమిటీల అత్యవసర సమావేశం ద ర్మారపు ఎలేందర్ అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది ఈ కార్యక్రమంలో MRPS జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య గారు పాల్గొని మాట్లాడుతూ. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని MRPS రాష్ట్ర కమిటీ పక్షాణ డిమాండ్ చేస్తున్నాం.B.J.P ప్రభుత్వం మొదటినుండి భారత రాజ్యాంగం పైన విషం కక్కుతూనే రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలు చేస్తుందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని అందుకే దీంతో వారి లోతైన రాజ్యాంగ వ్యతిరేక, దళిత వ్యతిరేక కుట్రలు బహిర్గతం చేస్తూ దేశంలో ఉన్న అనగారిన వర్గాలపై విషం కక్కుతున్నారని ఇలాంటి సంఘటనలు ఒక్కటే కాదు R.S.S గతంలో కూడా భారత రాజ్యాంగాన్ని బహిరంగంగానే కించపరిచిందని రిజర్వేషన్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ సూత్రాలను దెబ్బ తీసే విధంగా B.J.P ప్రభుత్వం అవలంబిస్తుందని డా.బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం కాదని ఇది ప్రజాస్వామ్యానికి పునాదిరాయిలాంటిదని అటువంటి రాజ్యాంగ నిర్మాతను కించపరిచే మాటలు మాట్లాడటం సమంజసం కాదని భారత రాజ్యాంగం ప్రతి భారతీయ పౌరునికి ముఖ్యంగా అనగారిన దళిత,గిరిజనుల ఆరాధ్య దైవం భారత రాజ్యాంగం డా.బి.ఆర్ అంబేద్కర్ గారు ఊహించిన న్యాయమైన సమ్మేళిత భారతదేశము యొక్క దృక్పథాన్ని పరిరక్షించడానికి మనల్ని మనం పునరంకితం చేసుకోవడానికి అన్ని వర్గాల ప్రజాసంఘాలు పార్టీలు ముందుకు వచ్చి ఇలాంటి చర్యలను ప్రతిఘటించాలని పిలుపునిస్తున్నాం. రాబోయే రోజుల్లో B.J.P పార్టీకి తగిన బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైనదని మరోసారి అంబేద్కర్ గారిని కానీ భారత రాజ్యాంగం జోలికి ఎవరు వచ్చిన తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయక పోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పులి శ్రీను, మహజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి CH. రాధ,MRPS మహిళా అధ్యక్షురాలు కుక్కల సుధారాణి, బాలరాజు,సంధ్య,రమా, బంటు ఎల్లయ్య, సత్యపాల్, పిచ్చయ్య, నవీన్, జ్యోతి, భాగ్య రేఖ, విజయ, కలమ్మ, రేణుక, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.