నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 1. (షేక్ గౌస్)
లంచ్ బ్రేక్ అంటూ తలుపులు మూసివేత
గతంలో ఇలాగే ఫిర్యాదులు – మారని పరిస్థితి
గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో బ్యాంకులను ఏర్పాటు చేసింది. కానీ కెనరా బ్యాంక్ ( సిండికేట్ బ్యాంక్ ) డోంకేశ్వర్ శాఖ అధికారులు మాత్రం నిభందనల ఉల్లంఘిస్తు తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.RBI (రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ) మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు ఉద్యోగులకు మధ్యాహ్న భోజన విరామం (లంచ్ బ్రేక్) ఉండే అవకాశం ఉన్నప్పటికీ, బ్యాంకును పూర్తిగా మూసివేయడానికి అనుమతి లేదు. సిప్ట్ పద్ధతిలో కొందరు సిబ్బంది బోజనానికి వెళ్లి కొందరు ఖాతాదారులకు సేవలు అందించాలి . కానీ డోంకేశ్వర్ కెనరా బ్యాంక్ శాఖలో మాత్రం లంచ్ బ్రేక్ సమయంలో తలుపులు మూసేస్తూ, ఖాతాదారులను బయట వేచి ఉండేలా చేస్తున్నారు.
ఇప్పటికే అనేక ఆరోపణలు – మారని ధోరణి
ఈ శాఖపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. సాయంత్రం 5 గంటల ముందు బ్యాంక్ మూసివేయడం, నిర్దేశించిన పని వేళలను పాటించకపోవడం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతున్నాయి. దీనిపై బ్యాంక్ హెడ్ ఆఫీస్‌కు ఫిర్యాదులు పంపినా ఇప్పటికీ మార్పు కనిపించడం లేదని ఓ ఖాతాదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
పరిసర గ్రామాల ఖాతాదారుల ఇబ్బందులు.
ఈ శాఖ సేవలను డోంకేశ్వర్ మండల కేంద్రం తో పాటు అన్నారం, సిర్పూర్, నికల్పూర్, కోమటపల్లి వంటి గ్రామాల ప్రజలు అధికంగా వినియోగిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఖాతాదారులు లంచ్ టైమ్‌లో తలుపులు మూసేయడంతో గంటల తరబడి బయట వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఖాతాదారుల ఆగ్రహం– చర్యలకు డిమాండ్
ఇది ప్రభుత్వ బ్యాంకు, ఉద్యోగులు తమ సొంత నియమాలు పెట్టుకుని పనిచేయడం సరైంది కాదు. ఖాతాదారులకు అందుబాటులో ఉండేలా బ్యాంక్ పని వేళలను ఖచ్చితంగా పాటించాలి. తలుపులు మూసివేయడం, ముందే బ్యాంక్ మూసివేయడం కస్టమర్లకు తీవ్ర అన్యాయం. దీనిపై వెంటనే అధికారుల చర్యలు తీసుకోవాలి” అని ఖాతాదారులు మండిపడుతున్నారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించే బ్యాంకు అధికారులు తమ నిర్లక్ష్య ధోరణిని మార్చుకోనే విధంగా, ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించాలని ఖాతాదారులు కోరుతున్నారు.