ఆర్మూర్ అభివృద్ధికి 20 కోట్లు కావాలని సీఎం ను కోరిన వినయ్ రెడ్డి.

ఆర్మూర్ జై భారత్ ఆగస్టు 12 : (షేక్ గౌస్) ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా తీర్చిదిద్దాలని సంకల్పంతో, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి‌ ని హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు.ఈ భేటీలో, ఆర్‌అండ్‌బీ రహదారుల విస్తరణ, పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, ఆర్మూర్ పట్టణ మౌలిక వసతుల విస్తరణ, ప్రభుత్వ దవాఖానలో తక్షణ వైద్యుల నియామకం, ఆధునిక వైద్య పరికరాల కేటాయింపు వంటి కీలక అభివృద్ధి అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు.అభివృద్ధి కార్యక్రమాల కోరకు ప్రత్యేక SDF నిధుల కింద రూ.20 కోట్ల మంజూరు చేయవలసిందిగా లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారని వినయ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment