నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27.
నందిపేట మండలంలోని మల్లారం గ్రామంలో 26 జనవరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా మల్లారం గ్రామస్తులు సోమవారం పాలాభిషేకం చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మరియు ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో నందిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ మల్లారం ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ యువత పాల్గొన్నారు.