VDCలు చట్ట పరిమితులు దాటితే సహించేది లేదు: జిల్లా జడ్జి భాస్కర్ రావు

జక్రాన్ పల్లి జై భారత్ జూలై 18: (షేక్ గౌస్) జక్రాన్‌పల్లి గ్రామాభివృద్ధి కమిటీలు (VDCలు) చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేపడుతున్న చర్యలపై జిల్లా అదనపు సెషన్స్ జడ్జి భాస్కర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జక్రాన్‌పల్లి మండలంలోని కొలిపాక, జక్రాన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టపరమైన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జడ్జి భాస్కర్ రావు మాట్లాడుతూ, “కుల బహిష్కరణలు, జరిమానాలు విధించడం వంటి చర్యలు పూర్తిగా చట్టవ్యతిరేకమైనవి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించింది. వాటిని భంగపెట్టే అధికారం ఎవరికీ లేదు. VDCలు చట్ట పరిమితులను దాటి నడిచితే, కఠిన న్యాయ చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.ఈ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవల సంస్థ సెక్రటరి న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకట్ రెడ్డి, సామాజిక కార్యకర్త బంగారు సాయిలు, ఎంఫిజే జిల్లా కన్వీనర్ షేక్ హుస్సేన్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి రెడ్డి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రామారావు న్యాయవాదులు బాస రాజేశ్వర్ ,పులి జైపాల్, , బీమ్ ఆర్మీ నాయకుడు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!