టౌన్ బేల్ పేరిట లంచానికి పాల్పడిన వర్ని ఎస్ఐ ఏసీబీ వలలో చిక్కాడు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8.నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కి చెందిన ఎస్ఐ అధికారం తన చేతిలో ఉన్నదని దుర్వినియోగం కి పాల్పడిన ఎస్ఐ కృష్ణ కుమార్ ఓ కేసులో రూ 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం వర్ని మండల కేంద్రంలోని కోటయ్య క్యాంప్ కు చెందిన మాజీ యంపిటిసి సభ్యుడు నాగరాజు, మరియు ఓ వ్యక్తి ఈనెల నవంబర్ 4వ తేదీన వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బాధితుడు వర్ని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. దీనితో ఎస్ఐ కృష్ణకుమార్ అదే రోజు నాగరాజు కు ఫోన్ చేసి భూతూలతో మాటలు జారాడు . నిందితుడు నాగరాజు పై కేసు నమోదు చేశారు.నగరాజు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఎస్ ఐ కృష్ణ కుమార్ ని కోరగా రిమాండ్ కి పంపిస్తానని బెదిరించి 50 వేల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేసాడు.చివరికి రూ 20 వేల కు బేరం కుదిరింది. టౌన్ బేలేబుల్ సెక్షన్ ఉండగా కూడా బెయిల్ ఇవ్వకుండా అత్యాశ కు  పాల్పడడంతో నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించడు ఏసీబీ అధికారులు పక్క పథకం ప్రకారం వర్ని పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ కృష్ణ కుమార్ ను లంచం తీసుకుంటుండగా స్టేషన్ లోనే పట్టుకున్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!