నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్
మోపాల్ మండలం మంచిప్ప చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథన ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు యువకులు మంచిప్ప దర్గా దర్శనానికి వచ్చారు . దర్శించుకుని ఆరుగురిలో ఇద్దరూ యువకులు సరదగా స్థానిక పెద్ద చెరువులో దిగగా నీట మునిగారు.రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహం లభ్యం అయ్యింది. మృతుల వివరాలు(1) సయ్యద్ వసీక్ 32 సంవత్సరాలు కమిటీ హాల్ దగ్గర చంచల్ గూడా,కరాచీ బేకరీలో అకౌంటెంట్ గా పని చేసేవాడు ,(2) సయ్యద్ యాకూబ్ 32 సంవత్సరాలు, నివాసము అంజుమన్ ఫంక్షన్ హాల్ చంచల్ గూడా ఆటోమొబైల్ షాపులో పనిచేసేవాడు కాగ మోపాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గంగాధర్ తెలిపారు.