నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6:ముప్కాల్ మండల శివారులో ఏడవ నెంబర్ పాత జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఆటో బోల్తా పడి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం బాల్కొండ మండలం కిసాన్ నగర్ లోని నచికేత ఆవాసం కు చెందిన విద్యార్థులు ముప్కాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజులాగే పాఠశాల ముగిసిన అనంతరం 13 మంది విద్యార్థులు తిరిగి వెళ్తున్న సమయంలో అకాస్మికంగా అదుపుతప్పి ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ తో పాటు ముగ్గురు చిన్నారి విద్యార్థులకు గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ లో గాయపడ్డ విద్యార్థులను బాల్కొండ హాస్పిటల్ తరలించారు. చెయ్యి విరిగిన ఒక విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు.
కాగా స్థానికంగా ఉన్న ఆవాస విద్యార్థులను దగ్గరలోనే ఉన్న కిసాన్ నగర్ ఉన్నత పాఠశాలలో చేర్పించాలని సానికులు నిర్వాహకులను నిలదీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో బోల్తా, ముగ్గురు విద్యార్థుల గాయాలు
Published On: November 6, 2024 9:25 pm
