నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని డిచ్పల్లి బస్టాండ్ ఎదురుగా గల మినీ బ్యాంకు(సర్వీస్ సెంటర్) లో పట్టపగలే చోరి జరిగింది. సోమవారం మధ్యాహ్నం మినీ బ్యాంక్ డోర్ పగుల గొట్టి క్యాష్ కౌంటర్ లోని సుమారు 60,000 వేల నగదును గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు.విషయం తెలిసిన వెంటనే డిచ్పల్లి ఎస్ ఐ మహమ్మద్ ఆరిఫ్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలలో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. పోలీసుల కథన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మినీ బ్యాంక్ నిర్వాహకుడు మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లి వచ్చే సమయం లోనే ఈ దొంగతనం జరిగిందని ఎస్ ఐ తేలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఎస్ ఐ మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు.
డిచ్ పల్లి మినీ బ్యాంకు లో పట్టపగలే దొంగతనం
Published On: December 22, 2025 10:41 pm









