నందిపేట్ జై భారత్ జూన్ 9:(షేక్ గౌస్) తల్వేద గ్రామం నుండి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఓ పెద్ద చెట్టు అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా, అందిన సమాచారం ప్రకారం ఎదురుగా వచ్చిన బలమైన గాలుల కారణంగా చెట్టు వంగి రోడ్డుపై పడిపోయినట్లు చెబుతున్నారు.ఈ ఘటన వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి పూర్తిగా మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయి, ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యం జరిగింది.ప్రభుత్వ యంత్రాంగం విస్తృతంగా స్పందించి చెట్టును తొలగించి రహదారిని క్లియర్ చేసిన తరువాతే ట్రాఫిక్ పునరుద్ధరించబడింది. వర్షా కాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
తల్వేద నుండి నందిపేట్ వెళ్లే రోడ్లలో చెట్టు పడిపోవడంతో తీవ్ర అసౌకర్యాలు
Published On: June 9, 2025 10:07 pm
