తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25.
కాకినాడ జిల్లా జగ్గంపేట
అక్షర విద్యా సంస్థల అధ్యాపక బృందం ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర శబరిమలై పరిసర ప్రాంతాల్లో ఆ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ముందుగా జగ్గంపేట నుండి ఉదయం విద్యా సంస్థల బస్సుల్లో బయలు దేరి ఆనంద డోలికల మధ్య శబరి మలై చేరికున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు ఆంధ్ర శబరిమలై మరియు సమీప జలపాతాలను సందర్శించడంతో పాటు చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో ఆట పాటలతో,డాన్స్ బేబీ డాన్సులతో అలరించి ప్రత్యేక అనుభూతి పొందారు.ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి,దైవ అనుగ్రహం పొందడానికి,మనుషుల మధ్య అంతరాలను తగ్గించడానికి కార్తీక మాసంలో వనభోజనాలు ఎంతగానో దోహదపడతాయని అక్షర విద్యా సంస్థల చైర్మన్ పి. సతీష్ మరియు కరస్పాండెంట్స్ ఆళ్ళ రవి కిషోర్, ఆళ్ళ శ్రీనివాస్ తెలిపారు.