తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7.
తెలంగాణ రాష్ట్రంలో సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతుగా నిలిచి వారి ధర్నాలో పాల్గొన్నటువంటి తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ , ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతుగా ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు తాత్కాలికంగా మూడు నెలలు నిరసన తెలుపవద్దని రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉత్తర్వులు జారీ చేసిందని , దానిని అబ్బగోని అశోక్ గౌడ్ ఖండిస్తూ ముందు వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వారు చేపట్టిన ధర్నా న్యాయబద్ధమైన కావున వారికి శ్రామిక దోపిడి జరుగుతుందని తగిన పనికి తగిన వేతనం కల్పించాలని, వారి డిమాండ్స్ ని నెరవేర్చాలని ఎమ్మెల్సీ అభ్యర్థి చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని డిమాండ్ చేశారు.వారికి మద్దతుగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బిజ్జారం అంబదాస్ మరియు సర్వ శిక్ష అభియాన్ మరియు కేజీవీబీ ఉద్యోగస్తులు,పాల్గొన్నారని తెలియజేశారు.