జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన యాదవులను చైతన్య పరచడమే లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3.
యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్  యాదవ్

జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన ఉన్న యాదవులను చైతన్య పరిచి ప్రభుత్వ పరంగా సంఘాల పరంగా న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కులను సాదించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గనవేని మల్లేష్ యాదవ్ ,జిల్లా కార్యవర్గ సభ్యుడు చిర్రం ప్రకాష్  యాదవ్ లక్ష్మి నారాయణ యాదవ్ అన్నారు..
కొడిమ్యాల మండలంలోని 1. నల్లగొండ మరియు 2. తిప్పయ్య పల్లె గ్రామాలలో యాదవ సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించి యాదవుల సమస్యల పరిష్కారం,ఐక్యత,సభ్యత్వ నమోదు గురించి చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది..

అనంతరం తిప్పయ్య పల్లె యాదవ సంఘ సభ్యులు 86 మంది నల్లగొండ గ్రామ యాదవ సంఘ సభ్యులు 25 మంది సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రాగ సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ రసీదులను అందించిన యాదవ సంఘం అడహాక్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు చిర్రం ప్రకాష్ యాదవ్ లు అందించారు..
ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల యాదవ సంఘ సభ్యులు పిల్లి చంద్రయ్య యాదవ్, లెంకల లక్ష్మి రాజాం యాదవ్, కడువాల మల్లేశం యాదవ్, గిద్దమారి ఓదెలు యాదవ్, పిల్లి రమణయ్య యాదవ్, ల్యాగల రాజేష్ యాదవ్, చిట్యాల పర్స రాములు యాదవ్ భాసం పర్సరాములు యాదవ్, చిన్న పర్సరం యాదవ్ అనుప నర్సయ్య యాదవ్ చేగుట గంగారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!