నిజాంసాగర్ జై భారత్ ఆగస్టు 18: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో సోమవారం ఉదయం 2 గంటలకు 7 వరద గేట్ల ద్వారా 58,500 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్టు ఈఈ సొలొమాన్ తెలిపారు. ఆదివారం రాత్రి అకస్మాత్తుగా వరద నీటి ప్రవాహం పెరిగినట్లు సమాచారం. సాయంత్రం వరకు 49 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రకటించిన అధికారులు, రాత్రి 11 గంటలకు ఏకంగా 90 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రకటించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు 7 గేట్ల ఎత్తివేత.
Published On: August 18, 2025 10:47 pm











