నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 ( షేక్ గౌస్)
నందిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న బస్ డిపో ఆవరణలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. నందిపేట్ ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం… కల్లు డిపోలో మద్యం సేవిస్తున్న ఏడుకొండ రమేష్‌కు గుర్తుతెలియని వ్యక్తులతో ఘర్షణ జరిగింది. ఆ తర్వాత బస్ ఖాళీ జాగా లో దుండగులు అతనిపై రోకలిబండలతో దాడి చేసి తల భాగంలో, గొంతు వద్ద తీవ్ర గాయాలు కలిగించారు.గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయిన రమేష్‌ను వదిలేసి వెళ్ళిపోయారు అయితే ఉదయం గ్రామస్తులు మూలుగుతున్న బాధితున్ని గ్రామస్తులు చూసి 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నందిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఈ ఘటన రాత్రి సమయంలో జరిగినట్లు అనుమానిస్తున్నారు, గొడవకు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.
గాయపడిన ఏడుకొండ రమేష్ లోకేశ్వర్ మండల కేంద్రానికి చెందినవాడిగా భావిస్తున్నామని, అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా స్పష్టత లేదని అన్నారు. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు