ఆర్మూర్ జై భారత్ జూలై 7: ( షేక్ గౌస్ ) మాదిగల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి మైలారం బాలు మాదిగ అన్నారు.ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ— గత 31 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ, ఆరోగ్యశ్రీ, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల పెంపు వంటి అనేక ప్రజా సమస్యలపై ఎమ్మార్పీఎస్ విజయవంతంగా ఉద్యమాలు నిర్వహించి ఫలితాలు సాధించిందని వివరించారు.మందకృష్ణ మాదిగ గారి ఉద్యమాల వల్ల మాదిగ జాతికి ఆత్మగౌరవం లభించిందని, అణగారిన వర్గాలకు ఆయన స్పూర్తినిచ్చారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మార్పీఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి శ్యామ్ మాదిగ, సీనియర్ నాయకులు ఇందరపు రాజు మాదిగ, మండల అధ్యక్షుడు రాము మాదిగతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర- మైలారం బాలు
Updated On: July 7, 2025 9:00 pm
