నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జ్ పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 11. నేడు పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో ” సమీక్ష సమావేశం నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీ సి. హెచ్. సింధూశర్మ, ఐ.పి.యస్. ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా నేడు పోలీస్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈ దిగువ తెలిపిన విషయాలు చర్చించినారు. పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అండర్ ఇన్వేస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాట. కోర్టులలో ఉన్న కేసుల త్వరితగతిన పరిష్కారానికి కృషిచేయుట. మహిళల భద్రతకోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వారికి అన్ని రకాల భద్రతల విషయంలో ఎల్లప్పుడు సహాకారం అందించాలని తెలియజేశారు. ఇప్పటి వరకుజరిగిన నేరాలలో త్వరితగతిన” పరిశోధన” పూర్తిచేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సూచించారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన ” నిఘా ” ఏర్పాటు మరియు లాడ్జీలలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయడం. పెండింగ్ లో ఉన్న ఎన్.బి. డబ్ల్యూస్లపై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్ ఏర్పాటుచేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాట గురించి సూచించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులలో చాలా రోజులలో పెండింగ్ లో ఉన్న ఎన్.బి.డబ్ల్యూ సర్వ్ చేయాలన్నారు. అవసరం అయితే ఎల్.ఓ.సి లు పెట్టాలన్నారు. సైబర్ మోసాల నియంత్రన కోసం 1930 ఫోన్ నెంబర్ గురించి ప్రజలకు అవగాహణ కల్పించాలి.అన్ని పోలీస్ స్టేషన్ పరిదులలో” పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, బీట్ల ఏర్పాటు, రాత్రి సమయాలలో వాహనాల తనిఖీ చేసి, దొంగతనాల నివారణకు కృషి చేయుట.ఎటువంటి చిన్న నేరాలు జరుగకుండా సంబంధిత అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ” నిఘా వ్యవస్థ పటిష్ట పర్చడము.డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) శ్రీ కోటేశ్వర రావు ,అదనపు పోలీస్ కమీషనర్ ( ఎల్ అండ్ ఒ) శ్రీ బస్వారెడ్డి , ఎ.సి.పిలు, సి.ఐలు ,ఎస్.ఐలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!