నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 (షేక్ గౌస్)
నందిపేట మండలంలోని కంఠం గ్రామం, డొంకేశ్వరం మండలంలోని తొండకూర్ గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కంఠంలో మంజూరైన 24 ఇండ్లకు ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు శంకుస్థాపన చేయగా, తొండకూర్ గ్రామంలో 28 లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు సంప్రదాయంగా ముగ్గు వేశారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ—స్వంత ఇళ్లు కావాలని ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన తమకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ దశలను ‘ఇందిరమ్మ’ యాప్‌లో జియో ట్యాగింగ్‌తో పాటు ఫోటోల రూపంలో అప్‌లోడ్ చేయాలి. ప్రతి దశలో పూర్తి సమాచారం అందించిన తరువాతే ప్రభుత్వం నిధులను విడుదల చేయనుంది.ఈ పథకం గ్రామీణ పేదలకు గృహ కలను నెరవేర్చేలా రూపొందించబడిందని స్థానికులు పేర్కొన్నారు. కంఠం, తొండకూర్ గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాలు స్థానిక ప్రజల ఆశలను గౌరవించి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు.