హైదరాబాద్ జై భారత్ జూన్ 16: తెలంగాణలో ప్రజల తరఫున మాట్లాడే నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరోసారి ఏసీబీ విచారణకు పిలవడాన్ని కాంగ్రెస్ కుట్రగా పేర్కొన్నారు. కేసీఆర్‌ను నిన్న, కేటీఆర్‌ను నేడు విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్యంపై దాడి అని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రపూరితంగా విచారణ జరుపుతుండడాన్ని ఖండించిన ఆయన, ‘‘మరో వంద అక్రమ కేసులు పెట్టినా తలవంచం. అరెస్టులు చేసినా భయపడం’’ అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజల్లో కడిగిన ముత్యంలా నిలుస్తారని పేర్కొన్నారు.కేటీఆర్ నిఖార్సయిన ఉద్యమకారుడని, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటేలా పనిచేసిన నాయకుడు బురద జల్లడం తగదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలును కోరుతూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.‘ప్రజల కోసం గళమెత్తే నేతలను హింసించే కాంగ్రెస్ చివరికి ధ్వంసం అవ్వాల్సిందే,’’ అని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.