నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28.
నందిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా డీసీఓ శ్రీనివాస్ రావుకి వినతి పత్రం అందజేసిన నందిపేట్ గ్రామ రైతులు మండల కేంద్రంలో పీఏసీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని కోరారు.నందిపేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఐలాపూర్ సొసైటీ నుండి వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ రైతు నాయకులు దమ్మాయి సుధాకర్,గడ్డం చిన్న రెడ్డి,పీఏసీఎస్ సభ్యులు నాగుల ఆశన్న,కొండాపురం నర్సయ్య,ఎర్రం నడిపి ముత్యం,సాంబారు నారాయణ,బూకా లింబాద్రి,ద్యావతి లింగం,మంగళరం శ్రీను,ఏషల చిన్నయ్య,గొల్ల మల్లయ్య,నాగ ముత్యం,కుమ్మరి సాగర్,కళ రమేష్,కొండాపురం బోజన్న,దేవేందర్,నాగుల భోజన్న,మంద శశి తదితరులు పాల్గొన్నారు.