అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18.
శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో మున్సిపల్ అధికారులు నిర్వహించిన రేషన్ కార్డుల సర్వేలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ మెడిదాల సంగీత రవి గౌడ్ తో కలిసి పర్యటించి సర్వేను సమీక్షించారు.ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు అందించడం తమ పార్టీ ముఖ్య ధ్యేయమని పేర్కొన్నారు.అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. 
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షైక్ మున్ను భాయ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విట్టం జీవన్, మున్సిపల్ మాజి చైర్మన్ పండిత్ పవన్, కౌన్సిలర్లు హన్మండ్లు, రవి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్, చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!