తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17.
తెలంగాణ టెట్ -2 దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 20వ తేదీతో అప్లికేషన్ల గడువు పూర్తి కానుంది.నవంబర్ 16వ తేదీ నాటికి మొత్తం 1,26 వేలకు పైగా అప్లికేషన్లు అందాయి. మరికొద్దిరోజులే గడువు ఉండటంతో అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే అప్లికేషన్లకు సంబంధించి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.అప్లికేషన్లలో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎడిట్ ఆప్షన్ తో మీ దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే… మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.