తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8.
ఫిబ్రవరి నెలలో సమ్మెకు దిగడానికి టి జి ఎస్ ఆర్ టి సి జేఏసీ సిద్ధమవుతుంది.
హైదరాబాదులోని బస్ భవన్ ఆపరేషన్ ఈడి మునిశేఖర్ కు జనవరి 7న సమ్మె నోటీసు తోపాటు 21 డిమాండ్ల పత్రాన్ని కార్మిక సంఘం నేతలు అందించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 10న సాయంత్రం నాలుగు గంటలకు చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ జేఏసీకి కార్మిక శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.