నందిపేట్ జై భారత్ జూన్:2 (షేక్ గౌస్)నందిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంది విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులు అర్పించారు.మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం అమరవీరుల త్యాగాలు విలువైనవని, సోనియా గాంధీ ఆ త్యాగాలకి చలించి రాష్ట్రం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజలకు మంచి పాలన అందుతోందని పేర్కొన్నారు.అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందిపేటలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
Published On: June 2, 2025 1:48 pm
