నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఆదివారం ఫిబ్రవరి 16.
బీసీ ల ముదిరాజ్ ఆడబిడ్డ అయినటువంటి దర్పల్లి మండల కేంద్రానికి చెందిన అనూష హత్యను తీవ్రంగా ఖండిస్తూ హత్య చేసిన జనకంపెట్ కు చెందిన వినోదు ను కఠినంగా శిక్షించాలని అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. అబ్బ గోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ అనూష ను ప్రేమించి నమ్మించి మోసం చేసి మాయమాటలు చెబుతూ లొంగ తీసుకోవడం జరిగింది వారి మధ్య గత కొంతకాలంగా వినోద్ మద్యానికి బానిసై అనూషతో విభేదాలు పెంచుకొని తరచుగా గొడవలు సృష్టించేవాడని వారి గ్రామ పెద్దల సమక్షంలో 11 లక్షల రూపాయలు ఆమెకు చెల్లిస్తానని చెప్పి మళ్లీ ఆమెను లొంగదీసుకుని 5 లక్షల వరకు బాకీ ఇప్పించమని ఆమె పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడని అందుకు అనూష ముదిరాజ్. మహిళాసంగం గ్రూపులో డబ్బులు ఇప్పించటం జరిగింది. డబ్బులు నెలనెలా కట్టాలని అడుగటంతో గత పదిహేను రోజులనుండి వారి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కిరాతకంగా హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించినటువంటి వినోద్ కు వెంటనే కఠినంగా శిక్షించాలని తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లోల సురేష్ గంగపుత్ర. తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు, రాజుల కృష్ణ ముదిరాజ్. ముదిరాజ్ యువ సేన రాష్ట్ర కార్యదర్శి కొప్పు రాజేందర్. తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం నాయకులు తదితరులు పాల్గొన్నారు.