తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 12.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8న తలపెట్టనున్న మహిళ శంఖారావం సభ పోస్టర్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 14 నెలలు అయినా మహిళలకు ప్రతినెల రూ 2500 ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి మహిళలకు రూ. 35 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో 35 వేలు జమ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.