ఏఎంసి చైర్మన్ పై తహసీల్దార్ కు పిర్యాదు.

తేలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 10:

పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామంలో పేదలకు కేటాయించిన ఇళ్ళ స్థలాలను కోటగిరి గుమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు అతని అనుచరులతో కలిసి కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎంపీటీసీ సోన్ కాంబ్లె సాయిలతోపాటు గ్రామస్తులు తాహసిల్దార్ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పేదల కోసం ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారని పేర్కొన్నారు. గతంలో అక్కడ సరైన వసతులు లేక నిర్మాణాలు చేపట్టలేక పోవడంతో కొంతమంది కబ్జాలు చేసుకుని స్థలాన్ని చదును చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అక్రమాలకు గురికాకుండా స్థలాన్ని కాపాడాలని తహసీల్దార్ గంగాధర్ కు కోరారు. ఎంపీటీసీ సాయిలు మాట్లాడుతూ…. స్థలాల కబ్జాపై ఏఎంసీ చైర్మన్ ను అడగగా ఇదేమిటని ప్రశ్నిస్తే మీకు దిక్కున చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళనున్న ట్లు పాత్రికేయులతో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సగ్ త్తురాం, సునీల్ దొండయ్య విట్టల్ దిరాజ్ దురుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!