ఆర్మూర్‌లో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 ( షేక్ గౌస్)
ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని కోటార్ (పెర్కిట్) ఏరియాకు చెందిన చిట్యాల రాజన్న-మంజుల దంపతుల మూడో కుమార్తె చిట్యాల నీత (17) బుధవారం రాత్రి మహాలక్ష్మి అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నీత చేపూర్‌లోని క్షత్రియ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతుండగా, అదే రోజు కుటుంబ సభ్యులతో బాబాయ్ మహేష్ ఇంటికి వెళ్లింది. అక్కడ తీవ్ర కడుపునొప్పి రావడంతో భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బంధువులు తెలిపారు. అపార్ట్మెంట్ పై నుంచి దూకిన అనంతరం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment